రోడ్డెక్కిన అన్నదాతలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన అన్నదాతలు

Mar 3 2026 7:25 AM | Updated on Mar 3 2026 7:25 AM

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి బడిగేటా, తెల్‌రాయ్‌ పంచాయతీలకు చెందిన వందలాది మంది రైతులు తమ ధాన్యం బస్తాలతో సోమవారం రోడ్డెక్కారు. కలిమెల సమితి ఎంవీ 90 గ్రామం వద్ద ఏర్పాటు చేసిన మాండీలో రోజుకి 3000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి 600 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం రోడ్డుపై నుంచి నిరసన తెలిపారు. అలాగే గంపాకొండ పంచాయతీలో కూడా రైతులకు టోకెన్‌ గడువు ముగిసిందని చెప్పడంతో ఎంవీ 66గ్రామం వద్ద జాతీయ రహదారిపై ధాన్యం బస్తాలు ఉంచి ధర్నా చేశారు. మల్కన్‌గిరి కలిమెల రహదారి పూర్తిగా నిలిపివేశారు. రైతులకు నాలుగు గంటల పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తేలిసిన కలిమెల ఐఐసీ ప్రభుదత్తు బిశ్వాల్‌ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. అలానే సరఫరా అధికారి చిన్మయ్‌ సాహు కూడా వచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement