అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద మృతి

Feb 28 2026 7:39 AM | Updated on Feb 28 2026 7:39 AM

అనుమా

అనుమానాస్పద మృతి

వలస కూలి

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి అంబాగూడ గ్రామానికి చెందిన ఓ వలస కూలి మృతి చెందారు. ఆదివాసీ తెగకు చెందిన అంబాగూఢ గ్రామ వాసి పడియా మాడీ (49) అనే వ్యక్తి బోర్‌వెల్‌ వాహనంలో పని చేయడానికి ఆంధ్రాకు వలస వెళ్లాడు. ఏం జరిగిందో గానీ గురువారం రాత్రి అతడి మృతదేహాన్ని వాహనంలో తీసుకువచ్చి ఇంటి ముందు దింపి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం గ్రామస్తుల సాయంతో కుటుంబ సభ్యులు, కలిమెల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా కడుపు భాగంలో గాయం కనిపించింది. ఎలా చనిపోయాడో తెలీకపోవడంతో ఐఐసీ ప్రభుదత్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద మృతి1
1/1

అనుమానాస్పద మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement