కొఠియాలో కలెక్టర్ పర్యటన
కొరాపుట్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో వివాదాస్పద ప్రాంతమైన కొఠియాలో కొండ ప్రాంతాలను కొరాపుట్ కలెక్టర్ సత్యవాన్ మహాజన్ పర్యటించారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియాలో కొండ పై ఉన్న గిరిజన గ్రామాలకు వెళ్లడానికి రోడ్డు మార్గం లేదు. దాంతో కలెక్టర్ సత్యవాన్ నడక బాట ఎంచుకున్నారు. దాంతో సుమారు 3 కిలోమీటర్ల దూరం కొండల పై నడక ప్రయాణం చేశారు. కలెక్టర్ వెంట జిల్లాస్థాయి ఉన్నతాధికారులు కూడా నడిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందల కోట్ల నిధులు కొఠియా గ్రామాల పై ఖర్చు పెడుతుంది. అయితే అవి క్షేత్రస్థాయిలో అమలవుతున్న విషయం కలెక్టర్ స్థాయి వ్యక్తి స్వయంగా చూడడానికి అవకాశం లేదు. దీంతో కలెక్టర్ ఆయా గ్రామాలకు స్వయంగా వెళ్లి గిరిజనులతో సంభాషించారు. గతంలో ఈ ప్రాంతం మావోయిస్టులకు కంచు కోట వలే ఉండేది.
కొఠియాలో కలెక్టర్ పర్యటన
కొఠియాలో కలెక్టర్ పర్యటన
కొఠియాలో కలెక్టర్ పర్యటన


