చిరస్మరణీయుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేసిన దివంగత ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు చిరస్మరణీయుడని కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్) దుంపల రామారావు(లక్ష్మణరావు) అన్నారు. ఆదివారం బొడ్డేపల్లి వర్ధంతి పురస్కరించుకొని నగరంలోని సింహద్వారం దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసిన మహోన్నత నాయకుడు బొడ్డేపల్లి అని కొనియాడారు. ప్రజా నాయకుడిగా రికార్డు స్థాయిలో పార్లమెంట్‌కు ఎన్నికై దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా వంశధార నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. రైతుల సంక్షేమం కోసం, సాగునీటి వనరుల కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడి నిధులు తీసుకొచ్చేవారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.


