అంబొదల ఐఐసీగా సూర్య చంద్రపాఢి బాధ్యతల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదల పోలీస్ స్టేషన్ ఐఐసీగా సూర్య చంద్రపాఢి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ పని చేసిన కల్పన బెహర జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో బాధ్యతలు చేపట్టిన పాఢి బిసంకటక్ పోలీస్ స్టేషన్ ఐఐసీగా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. అంబొదల ప్రాంతంలో శాంతి భద్రతలకు పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సూర్యచంద్రపాఢి చెప్పారు.
దోపిడీ కేసులో ముగ్గురు అరెస్టు
రాయగడ: దోపిడీ కేసుకు సంబంఽధించి ముగ్గురిని మునిగుడ పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరెస్టయి వారిలో సుమేన్ ప్రధాన్, అజయ్ ప్రధాన్, శివప్రధాన్‌లు ఉన్నారు. నిందితుల నుంచి 4,400 రూపాయల నగదు, 14 వెండి ఉంగరాలు, ఐదు వెండి గొలుసులు, రెండు కత్తులతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌డీపీవో సంతోషిణి ఒరం తెలియజేసిన వివరాల ప్రకారం.. మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాకులు గుడ కూడళి వద్ద గత నెల 20వ తేదీన మునిగడు ఖమనిగుడకు చెందిన భగవాన్ నాయక్ అనే వ్యక్తి వెళ్తుండగా.. మరణాయుధాలతో ముగ్గురు వ్యక్తులు భయపెట్టి అతని వద్ద గల నగదు కొన్ని బంగారు, వెండి వస్తువులను దోపిడీ చేశారు. ఈ మేరకు బాధితుడు మునిగుడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులు జాజ్‌పూర్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడికి గాయాలు
రాయగడ: రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రగాయాలకు గురైన సంఘటన జిల్లాలోని మునిగుడలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. గాయాలు తగిలిన వ్యక్తి టికరపడ ప్రాంతానికి చెందిన బిపిన్ పలకియాగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడుని మునిగుడ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. తన అన్న వివాహానికి సంబంధించి బంధువులకు పెళ్లి కార్డులు పంచిపెట్టి తిరిగి బైకుపై వస్తున్న సమయంలో మునిగుడ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోహత్య కేసులో ఇద్దరు అరెస్టు
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గి ప్రాంతంలో గోహత్య, గోమాంసం విక్రయానికి సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన వారిని నందనిమాల్, నందమదన్ పలకలుగా గుర్తించారు. గత శుక్రవారం దుర్గి ప్రాంతంలో గోమాంసం విక్రయం, అక్రమంగా రవాణా చేస్తున్న సమయంలో కొంతమంది గోసురక్షా సమితికి చెందిన కార్యకర్తలు అడ్డుకొని గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మాంసాన్ని పట్టుకుని బిసంకటక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉంచి ఆందోళన చేపట్టారు. దీనికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
అంబొదల ఐఐసీగా సూర్య చంద్రపాఢి బాధ్యతల స్వీకరణ
అంబొదల ఐఐసీగా సూర్య చంద్రపాఢి బాధ్యతల స్వీకరణ
అంబొదల ఐఐసీగా సూర్య చంద్రపాఢి బాధ్యతల స్వీకరణ


