ముగిసిన గజజ్యోతి –26 వేడుకలు
సెంచూరియన్ వర్సిటీలో
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో గజజ్యోతి 2026 వార్షిక వేడుకలు శనివారంతో ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన వేడుకల్లో అధ్యక్షులు డాక్టర్ ముక్తికాంత మిశ్రా, ఉపాధ్యక్షులు ఆచార్య డీఎన్ రావు, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ సుప్రియా పట్నాయిక్, ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ బిశ్వజిత్ మిశ్రా, రిజిస్ట్రార్ అనితా పాత్రో, డైరక్టర్ (అడ్మిన్) దుర్గా ప్రసాద్ పాడి సహకారంతో విజయవంతమైంది. ఆపరేషన్ సింధూర్‌లో ధైర్యసాహసాలను కనబరచిన ఆర్మీ కెప్టెన్ విపుల్ కుమార్‌కు సెంచూరియన్ వర్సిటీ అధికారులు మెమొంటోతో సత్కరించారు. వర్సిటీలో అన్ని విభాగాల్లో చదువుతున్న విద్యార్థులు ప్రెజెంట్ చేసిన 84 ఇన్నోవేటివ్ ప్రాజెక్టులను అధ్యాపకులు ప్రశంసించారు. వర్సిటీలో ఇరవై ఏళ్లు పనిచేసి అనేక సేవలు అందించి అధ్యాపక బృందాన్ని సత్కరించారు. చివరి రోజు బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ వరుణ్ జైన్ బాలీవుడ్ సంగీతానికి మంత్రముగ్ధులయ్యారు.
ముగిసిన గజజ్యోతి –26 వేడుకలు
ముగిసిన గజజ్యోతి –26 వేడుకలు
ముగిసిన గజజ్యోతి –26 వేడుకలు


