లారీని ఢీకొన్న కారు
● ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
మందస: మండలంలోని బాలిగం సమీపంలో ఉన్న ఎన్‌హెచ్ 16 జాతీయ రహదారిపై శనివారం రాత్రి లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారని ఎస్‌ఐ కృష్ణప్రసాద్ తెలిపారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న లారీని, ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు అతివేగంతో వస్తున్న కారు డివైడర్ దాటుకొని వెళ్లి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న షేక్‌ఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి పీయూష్ కుమార్ శ్రీకాకుళంలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అలాగే మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా ఒడిశా రాష్ట్రంలోని కటక్ ప్రాంతానికి చెందినవారని తెలిపారు.
లారీని ఢీకొన్న కారు
లారీని ఢీకొన్న కారు


