సైనికా.. సెలవిక
● అధికార లాంచనాలతో జవాన్ అంత్యక్రియలు
నరసన్నపేట: మండలంలోని చిక్కాలవలసకు చెందిన జవాన్ దంత అమృత్‌కుమార్(41) అంత్యక్రియలు అధికార లాంచనాలతో ఆదివారం చేపట్టారు. గత 20 ఏళ్లుగా సీఆర్‌పీఎఫ్ జవానుగా పనిచేస్తున్న అమృత్‌కుమార్ శుక్రవారం మణిపూర్ వద్ద విధుల్లో ఉండగా గుండెపోటుకు గురై మరణించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. మడపాం టోల్‌గేట్ వద్దకు మృతదేహం చేరుకోగా అక్కడ నుంచి చిక్కాలవలస వరకు నరసన్నపేటకు చెందిన పారా మిలటరీ అసోసియేషన్ ప్రతినిధులు, మాజీ సైనికులు ర్యాలీగా తీసుకెళ్లారు. పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు. పోలాకి జెడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య అంత్యక్రియల్లో పాల్గొని అమృత్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎస్‌ఐ బలివాడ గణేష్, ఎస్‌ఐ–2 శేఖరరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు యాబాజి రమేష్, బొబ్బాది ఈశ్వరరావు, కింతలి చలపతిరావు, మొయ్యి లక్ష్మునాయుడు, సడగాన రవి తదితరులు పాల్గొన్నారు.


