బ్రహ్మోత్సవాలకు గరుడ, శేష వాహనాలు సిద్ధం
● నేటినుంచి కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
రాయగడ: పారిశ్రామిక ప్రాంతమైన జేకేపూర్‌లో కొలువైయున్న భూసమేత శ్రీకల్యాణ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. స్వామి వారి సేవకు శేష, గరుడ వాహనాలు సిద్ధమయ్యాయి. ఆదివారం ఉదయం వీటికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా పూజలను నిర్వహించి సిద్ధం చేశారు. సోమవారం ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఉదయం 8.30 గంటలకు కలశయాత్రను నిర్వహించనున్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు మహిళలు, భక్తులు, హరేరామ, హరేకృష్ణ బృందాలు కలశ యాత్రలో పాల్గొనేలా నిర్వాహకులు సన్నహాలు చేశారు. సమీపంలోని నాగావళి నది వద్ద గంగామాతకు పూజలు నిర్వహించిన అనంతరం నది నుంచి 108 కలశాలతో శుద్ధమైన నీటిని తీసుకువచ్చి స్వామి వారి సన్నిధిలో ఉంచి పూజలను ప్రారంభిస్తారు.
బ్రహ్మోత్సవాలకు గరుడ, శేష వాహనాలు సిద్ధం
బ్రహ్మోత్సవాలకు గరుడ, శేష వాహనాలు సిద్ధం
బ్రహ్మోత్సవాలకు గరుడ, శేష వాహనాలు సిద్ధం


