మునిగుడ సమితి కార్యాలయం గేటు వద్ద యువకుని మృతదేహం
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఒక యువకుని మృతదేహాన్ని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. మృతుడు సమితిలో క్లరికల్ విభాగంలో పనిచేస్తున్న సుశాంత గౌడొ (34) గా గుర్తించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... ఉదయం సుశాంత్ కడుపు నొప్పిగా ఉందని ఇంటి నుంచి మునిగుడలొ గల సీహెచ్‌సీకి వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో సమితి కార్యాలయం గేటు వద్ద పడిపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
కొరాపుట్: దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా మైదల్ పూర్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఏఎస్పీ ఆదిత్య సేన్ ప్రసంగించారు. సెమ్లా ప్రాంతంలో అటవీ భాగంలో అనుమానితుల సంచారం పై తమకు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిని అదుపులోనికి తీసుకున్నారు. వారిని విచారించగా పపడాహండి ప్రాంతంలో ఒక వ్యాపార వేత్త ఇంటి పై దాడికి సిద్ధంగా ఉన్నారని అంగీకరించారన్నారు. ఈ ఘటన లో 5 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా లో మరి కొందరిని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. నిందితుల నుంచి కత్తులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
హెచ్‌పీవీ టీకాలు ప్రారంభం
రాయగడ: జిల్లాలోని హ్యూమన్ పాపిల్లొమా వైరస్ (హెచ్‌పివి) నివారణ చర్యలకు జిల్లా వైద్య శాఖ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఆదివారం నాడు జిల్లా ప్రధాన హస్పటల్ (డిహెచ్‌హెచ్) సమావేశం హాల్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొరాపుట్ లొక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, గౌరవ అతిథిగా రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రకలు హాజరయ్యారు. రాష్ట్రంలో గల 14–15 ఏళ్ల మధ్య వయసు గల బాలికలు 3.36 లక్షల మందికి టీకా అందజేయనున్నారు. రాయగడ జిల్లాలోని 7587 మంది బాలికలకు ఈ టీకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఆమె వివరించారు. గర్భాశయ క్యాన్సర్ ను నివారించడానికి ఈ టీకా ఎంతో దోహదపడుతుందని అన్నారు.
మహానది జల వివాద
ట్రిబ్యునల్ బృందం సందర్శన
భువనేశ్వర్: క్షేత్ర పరిశీలన కోసం 5 రోజుల రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన మహానది జల వివాద ట్రిబ్యునల్ (ఎండబ్ల్యూడీటీ) చైర్‌పర్సన్, సభ్యులు పవిత్ర పుణ్య క్షేత్రం పూరీ శ్రీమందిర్‌ను సందర్శించి రత్న వేదికపై కొలు వై ఉన్న సోదరసోదరి సమేత శ్రీ జగన్నాథుని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పీతాంబర్ ఆచార్య విలేకరుల సమావేశం నిర్వహించి మహానది నీటిపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మధ్య ఉన్న వివాదం త్వరలో పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశా రు. మహానది జల వివాద ట్రిబ్యునల్ బృందం ఈ నెల 7న ఛత్తీస్‌గఢ్‌ను సందర్శిస్తుంది. మార్చి 11 వరకు ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహిస్తుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు – మోహన్ చరణ్ మాఝి, విష్ణు దేవ్ సాయి మహానది జల వివాదానికి పరిష్కారం విషయ మై చర్చించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా ఊగిసలాడుతున్న మహా నదీ జ లాల పంపిణీ వివాదం త్వరలో కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. మహానది జల వివాద ట్రి బ్యునల్ బృందం ఒడిశాను సందర్శించి మహా నది బేసిన్‌లోని సమగ్ర పరిస్థితిని హెలికాప్టర్ ద్వారా విహంగ సర్వే నిర్వహింంచింది. మహా నది నీటి కొరతతో ప్రభావితమైన ప్రాంతాలను ఈ బృందం సమీక్షించింది.
మునిగుడ సమితి కార్యాలయం గేటు వద్ద యువకుని మృతదేహం


