ఢిల్లీలో సీఎం మాఝి, బీజేపీ చీఫ్ నబీన్ సమావేశం
భువనేశ్వర్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 4 స్థానాలకు రాజ్యసభ నామినేషన్లపై ఉత్కంఠ నెలకొనగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి శుక్రవా రం న్యూ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీ య అధ్యక్షుడు నితీన్ నబీన్‌ను కలిశారు. నితీన్ నబీన్ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలకు వీరిరువురి సమావేశం ఆజ్యం పోసింది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై న నితీన్ నబీన్ ఈ ఏడాది జనవరి 19న పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో అధికార బీజేపీ త్వరలో జరగనున్న రాజ్య సభ ఎన్నికల్లో 2 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ప్రతిపక్ష బిజూ జనతా దళ్ 2024 ఎన్నికల తర్వాత రాష్ట్ర శాసన సభలో వారి బలం ఆధారంగా ఒక స్థానాన్ని కై వసం చేసుకోనుంది. ఈ లెక్కన 4వ స్థానానికి గట్టి పోటీ ఉంటుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి న్యూ ఢిల్లీ సందర్శన పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యక్షునితో సమావేశం ఎగువ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహంపై చర్చలు జరిగి ఉండవచ్చనే ఊహాగానాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ సమావేశంలో సంస్థాగ త సమన్వయం, అభివద్ధి ప్రాధాన్యతలపై సంభాషించినట్లు బీజేపీ అధికార వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో సంస్థాగత సమన్వయం బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై ఫలప్రదమైన చర్చలు జరిపినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సుపరిపాలన, సమ్మిళిత వృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమంపై ఉమ్మడి నిబద్ధతపై చర్చ కొనసాగిందని అన్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ సంభావ్య రాజ్య సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ పార్లమెంటరీ బోర్డు పరిశీలన కోసం పంపినట్లు ముఖ్యమంత్రి ధ్రువీకరించారు. బీజేపీ రాష్ట్ర కమిటీకి అనేక సూచనలు అందాయి. అన్ని పేర్లను పార్లమెంటరీ బోర్డుకు పంపారు. అది తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను ఒడిశా నుండి పోటీకి నిలబెడితే కేంద్ర నాయకత్వం రాష్ట్రంపై వ్యూహాత్మక దష్టి సారిస్తుంది. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలం గణనీయంగా దడపడుతుంది. అదే సమయంలో ముఖ్యమంత్రికి జాతీయ నాయకత్వంతో సన్నిహితంగా పని చేసే సంబంధాన్ని బలోపేతం చేస్తుందనే దక్పథంతో రాష్ట్ర శాఖ జాతీయ అధ్యక్షునికి మద్దతు ఇవ్వాలని యోచిస్తోంది.


