భువనేశ్వర్: రంగుల పండగ ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తూ సైకత యానిమేటర్ మానస్ కుమార్ సాహు సైకత శిల్పాన్ని రూపొందించారు. దాదాపు 2 గంటలు నిర్విరామంగా శ్రమించి దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నాడు. ఆనందం, సామరస్యం, ఐక్యత, బాధ్యత మేళవింపుల పండగ హోలీ అని అభివర్ణించాడు. సామాజిక అవగాహన, సాంస్కృతిక వ్యక్తీకరణ మాధ్యమంగా ఈ కళాఖండం ఆవిష్కరించినట్లు తెలిపారు.
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. శాసనసభలో సంఖ్యా బలం దృష్ట్యా తొలి 2 స్థానాల్లో అనుకూలత నేపథ్యంలో పార్టీ కేవలం ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటించినట్లు స్పష్టమవుతోంది. వారిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, మాజీ రాజ్యసభ సభ్యుడు సుజీత్ కుమార్ ఉన్నారు. ఈ ఇరువురి అభ్యర్థిత్వం ఎంపిక నిర్ణయం పార్టీ సంస్థాగత బలం మరియు ప్రాంతీయ ప్రాతినిధ్యంపై ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. రాష్ట్రంలో అట్టడుగు స్థాయి స్థితి నుంచి భారతీయ జనతా పార్టీకి అధికార హోదాకు అందలం ఎక్కించిన అనుభవజ్ఞుడుగా పేరొందిన ప్రస్తుత రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్‌కు ఎగువ సభ ప్రాతినిథ్యం కల్పించడం రాజకీయ ప్రాముఖ్యతకు అద్దం పడుతోంది. పశ్చిమ ఒడిశా కలహండి ప్రాంతీయునిగా విధానపరమైన నేపథ్యానికి పేరుగాంచిన సుజీత్ కుమార్ ఎగువ సభలో పార్టీ ప్రాతినిధ్యానికి కొనసాగింపు ప్రాంతీయ సమతుల్యతకు ప్రాణం పోస్తుంది.
అంజిపేటలో కార్చిచ్చు
రాయగడ: స్థానిక జేఎస్‌కో సమీపంలో గల అంజిపేట వద్ద కొండపై మంటలు చెలరేగడంతో సమీపంలో గల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. వేసవి కాలం ప్రారంభంలో అటవీ శాఖ పలు విధాలుగా అవగాహన కల్పిస్తున్నా ఎక్కడో ఓ చోట ఇలా జరుగుతూనే ఉంది. అంజిపేటలో ఉన్న కొండపై గుర్తు తెలియని వారు ఎండిన వాటికి నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగాయని సమాచారం.
రూ.10.50 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
రాయగడ: రెండు కారుల్లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని పద్మపూర్ పో లీసులు పట్టుకున్నారు. కార్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు కార్లలో ఉన్న 105 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.10.50 లక్షలు ఉంటుందని అంచనా వేశా రు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు జిల్లా లోని గుణుపూర్ లొని కొమటి వీధికి చెంది న రజనీకాంత్ నాయక్‌గా గుర్తించారు. అయితే గంజాయి రవాణాకు సంబంధించి మరో నిందితు డు పోలీసులను చూసి కారును అక్కడే విడిచిపెట్టి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకా రం పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మిలకాపంగ గ్రామ సమీపంలో ఉన్న జీడి తోటలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు సొమవారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి పట్టుబడింది. పొరుగు జిల్లా గజపతి లొని అడవా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తున్న గుడ్రిపొంగ అడవుల నుంచి రెండు కారుల్లొ గంజాయిని పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాకుళంకు తరలిస్తుండగా పోలీసులకు నిందితుడు పట్టుబడ్డాడు. ఈ వివరాలను పద్మపూర్ పోలీస్ స్టేషన్ ఐఐసి ధరణీ ధర్ ప్రధాన్ తెలియజేశారు.


