ఘనంగా గణపతి మందిరం ప్రతిష్ట | - | Sakshi
Sakshi News home page

ఘనంగా గణపతి మందిరం ప్రతిష్ట

Feb 26 2026 9:11 AM | Updated on Feb 26 2026 9:11 AM

ఘనంగా

ఘనంగా గణపతి మందిరం ప్రతిష్ట

పర్లాకిమిడి: గుసాని బ్లాక్‌ బుసుకుడి గ్రామంలో అభయ గణపతి మందిర ప్రతిష్టామహోత్సవానికి అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నారాయణరావును ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గేదెల శ్రీధర్‌ నాయుడు, బబులా పట్నాయక్‌, జగన్నాథ పరిడా, రఘురాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అక్రమంగా తరలిస్తున్న

పశువుల పట్టివేత

మందస: బాలిగాం జంక్షన్‌ జాతీయ రహదారిపై రెండు వ్యాన్‌లలో అక్రమంగా తరలిస్తున్న పశువులను మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ పట్టుకున్నారు. ఒక బండిలో ఆరు పశువులు, మరో బండిలో ఏడు పశువులు మొత్తం 13 పశువులు పట్టుకుని వాహనాలపై కేసులు నమోదుచేసి గోశాలకు తరలించారు.

సారా నిర్మూలనకు కృషి

పాతపట్నం: నాటుసారా నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సారా రహిత గ్రామాలున్న మండలంగా పాతపట్నం ఎంపికై ందని శ్రీకాకుళం ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ డి.శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని ఒడిశా–ఆంధ్ర చెక్‌పోస్ట్‌, మెళియాపుట్టి మండలం వసుంధర చెక్‌పోస్ట్‌లను బుధవారం పరిశీలించారు. సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా నుంచి ఆంధ్రకు నాటు సారా, మద్యం రవాణాకు ఆస్కారమున్న ప్రాంతాల్లో తనిఖీలు విస్తృతం చేయాలన్నారు. అనంతరం పాతపట్నంలోని మద్యం షాపును తనిఖీ చేశారు. ఆయనతో పాటు పాతపట్నం ఎకై ్సజ్‌ సీఐ కె.కృష్ణారావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు ఉన్నారు.

రేషన్‌ డీలర్ల కమీషన్‌ పెంచాలి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రేషన్‌ డీలర్లకు ఇస్తున్న కమీషన్‌ను పెంచాలని రేషన్‌ డీలర్లు సంఘం జిల్లా అధ్యక్షుడు వడగ భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు కోరారు. ఈ మేరకు బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి జి.సూర్యప్రకాశరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమీషన్‌ పెంపు జరగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. షాపు అద్దె, డోర్‌ డెలివరీ అవుతున్న ఖర్చులు, సహాయకుడికి వేతనం, ఇతర ఖర్చులకు సరిపోవడం లేదన్నారు. ఐ.వి.ఆర్‌.ఎస్‌.సర్వేలో రేషన్‌ డీలర్లకు సంబంధం లేని అంశాలు చెప్పడం వల్ల డీలర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సర్వే ప్రకారం డీలర్లపై చర్యలు తీసుకోవద్దని, అవసరమైతే లబ్ధిదారుల వద్ద నుంచి నేరుగా అభిప్రాయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.రవికుమార్‌, రణస్థలం వెంకటరావు, శిమ్మినాయుడు, రామ్మూర్తినాయుడు, మురళీమోహన్‌, పోలాకి జగన్‌, మూర్తి, పలాస మోహనరావు, శ్రీను, రామకృష్ణ, పంచిరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.

1న క్రికెట్‌ ఎంపికలు

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా సీనియర్స్‌, అండర్‌–23 పురుషుల క్రికెట్‌ జట్ల ఎంపికలు మార్చి ఒకటో తేదీన జరగనున్నాయని జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు పుల్లెల శాస్త్రి, ప్రధాన కార్యదర్శి హసన్‌రాజా షేక్‌, మెంటార్‌ ఇలియాస్‌ మహ్మద్‌, కోశాధికారి మదీనా శైలానీ తెలిపారు. కళింగపట్నంలోని వైట్‌హౌస్‌ సమీపంలో ఉన్న క్రికెట్‌ మైదానంలో ఉదయం 9 గంటల నుంచి జిల్లా జట్ల సెలక్షన్‌ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు, ఫారం–5తో హాజరుకావాలని కోరారు. తెలుపురంగు యూనిఫాం, షూ విధిగా ధరించాలని వారు సూచించారు.

ఘనంగా  గణపతి మందిరం ప్రతిష్ట 
1
1/2

ఘనంగా గణపతి మందిరం ప్రతిష్ట

ఘనంగా  గణపతి మందిరం ప్రతిష్ట 
2
2/2

ఘనంగా గణపతి మందిరం ప్రతిష్ట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement