ఉత్కళ సమ్మిళినీ సమావేశాలు వాయిదా
జయపురం: ఈ నెల 28, మార్చ్ 1 తేదీల్లో జయపురంలో నిర్వహించాల్సిన ఉత్కళ సమ్మిళనీ రాష్ట్ర స్థాయి సమావేశాలు వాయిదా పడ్డాయి. విధాన సభలో బడ్జెట్ సమావేశాల వల్ల మంత్రులు రాలేకపోతుండడంతో ఉత్కళ సమ్మిళినీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రస్థాయి సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు సోమవారం స్థానిక స్వర్గీయ హరిశ్చంధ్ర బక్షీపాత్రో స్మృతి ఉద్యానవనంలో సమ్మిళని జిల్లా అధ్యక్షుడు మదన మోహణ నాయిక్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ముందుగా కార్యదర్శి నవీణ మదళగత సమావేశ నివేదికను సమావేశానికి సమర్పించారు. ఉపాధ్యక్షుడు రాజేంధ్ర గౌఢ రాష్ట్ర స్థాయి సమావేశంపై వివరించారు. ఫిబ్రవరి 28, మార్చ్ 1 వ తేదీలలో జయపురంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సమావేశంపై ఆయన వివరించారు. ఆ సమావేశానికి రాష్ట్ర మంత్రులను ఆహ్వానించామని, అయితే శాసన సభలో బడ్జెట్ సమావేశాలు జరగడం వల్ల మంత్రులు రావటం లేదని వివరించారు. అందుచేత రాష్ట్ర స్థాయి ప్రత్యేక సమావేశాలు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రులు వీలుని బట్టి త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. మంత్రులను సంప్రదించే బాధ్యతలను భృగుబక్షీ పాత్రోకు అప్పగించినట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి చంధ్ర కాంత సుతార్, సీనియర్ సభ్యులు ఫ్రఫుల్ల దాస్,శుభేంధు బ్రహ్మ, పరమేశ్వర పాత్రో తదితరులు పాల్గొన్నారు.


