రాయగడ: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ బిజూ పట్నాయక్ 110వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బీజేడీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సుధీర్ దాస్, పట్నాన గౌరీశంకర్ రావు, అనసూయా మాఝి తదితరులు సోమవారం సమావేశమై జయంతి ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. ఈ నెల ఐదో తేదీన బీజూ జయంతిని పురస్కరించుకుని స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల బిజూ పట్నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసే కార్యక్రమంతో పాటు భారీ ర్యాలీని నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయించారు.


