సూపర్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Feb 25 2026 7:08 AM | Updated on Feb 25 2026 7:08 AM

సూపర్

సూపర్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

సూపర్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

భువనేశ్వర్‌: స్థానిక ధౌలి లింగిపూర్‌ ప్రాంతానికి సమీపంలో సూపర్‌ మార్కెట్‌లో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటన స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. లక్షల రూపాయల విలువైన ఆస్తికి అపారమైన నష్టం వాటిల్లింది. బహుళ అంతస్తుల భవనంలో 3వ అంతస్తు నుంచి రాత్రి 10 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్వల్ప వ్యవధిలో మంటలు శర వేగంగా వ్యాపించాయి. సమీపంలోని స్థానికులు అప్రమత్తం అయి అగ్ని మాపక సేవలకు సమాచారం అందించారు. అగ్ని మాపక దళం పూర్తి సరంజామాతో ఘటనా స్థలానికి చేరుకుని 6 గంటలకు పైగా నిర్విరామంగా శ్రమించి మంటలను నివారించారు. సూపర్‌ మార్ట్‌లో మంటలను నీటితో నియంత్రించడం సాధ్యం కాలేదు. నురుగు సహాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నించామని అగ్నిమాపక శాఖ డైరెక్టరు జనరల్‌ సుధాంశు షడంగి తెలిపారు. గోడను పగలగొట్టి నురుగును ఉపయోగించి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఈ చర్యల్లో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ అడ్వాన్స్‌ రోబోటిక్‌ మానిటర్‌తో పాటు 40 అగ్నిమాపక యంత్రాలను మోహరించారు. అత్యంత మండే పదార్థం కారణంగా మంటలు విస్తృతంగా వ్యాపించినట్లు ఆయన పేర్కొన్నారు. మంటల తీవ్రత, ప్రభావిత అంతస్తులో ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, స్టీల్‌ పాత్రలు మరియు ఇతర గృహోపకరణాలు కాలిపోయాయి. ఫలితంగా గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

సూపర్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం1
1/1

సూపర్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement