ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా

Mar 4 2026 7:19 AM | Updated on Mar 4 2026 7:19 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : విద్య, ఉపాధ్యాయరంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్‌ (1938) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. తొలుత ఈ శిబిరాన్ని సంఘ రాష్ట్ర సహాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి చింతాడ దిలీప్‌కుమార్‌ ప్రారంభించారు. ధర్నాకు ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ హనుమంతు సాయిరాం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవాధ్యక్షుడు టెంక చలపతిరావు, జిల్లా అధ్యక్షుడు బి.రవి, ప్రధాన కార్యదర్శి బుక్కూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండేళ్లు దాటినా కొత్త వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, సరెండర్‌ లీవ్‌, ఎన్‌క్యాష్‌మెంట్‌ బకాయిలు చెల్లించడం లేదని, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement