ప్రజల అవసరాలకే ప్రాధాన్యం
గార: గ్రామాల్లో ప్రజల అవసరాల మేరకే అభివృద్ధి ప్రణాళికలో ప్రాధాన్యతనివ్వాలని ఎంపీపీ గొండు రఘురామ్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 2026–27 జీపీడీపీ ప్రణాళికపై సర్పంచ్‌లు, పంచాయతీ సెక్రటరీలతో సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కీలకమైన అంశాల్లో తాగునీటితో పాటు కాలువలు, రోడ్లు, పారిశుద్ధ్య పనులు ఉన్నాయన్నారు. అదేవిధంగా ఆర్థిక సంఘ నిధులతో పాటు స్థానికంగా వచ్చే ఇంటి పన్నులు వసూలు వంటివి అవసరమని పేర్కొన్నారు. కొర్లాం, అంపోలు, కళింగపట్నం సర్పంచ్‌లు పీస శ్రీహరిరావు, గొండు జయరాం, టి.అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ ఆర్థిక సంఘం నిధులు సకాలంలో జమ చేయడం లేదని, ఈ ఏడాది వచ్చినా వాటికి ఫ్రీజ్ చేయడంతో ఏ పనులు చేపట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీడీవో సురవజ్జల శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీవోలు ఈశర్ల రఘు, ఆర్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


