22న నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

22న నూతన కార్యవర్గం ఎన్నిక

Mar 2 2026 7:21 AM | Updated on Mar 2 2026 7:21 AM

22న నూతన కార్యవర్గం ఎన్నిక

22న నూతన కార్యవర్గం ఎన్నిక

పర్లాకిమిడి: చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు మార్చి 19న పంచాంగ శ్రవణం, 22న ఉగాది వేడుకలు, కొత్త కార్యవర్గం ఎన్నిక, ప్రమాణ స్వీకారం ఉంటుందని కార్యదర్శి బర్నాల జనార్దనరావు తెలిపారు. 22న ఉగాది వేడుకలు స్థానిక రాజవీధిలో ఒక ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహిస్తామన్నారు. ఆదివారం చైతన్య సమితి కార్యవర్గం స్థానిక శ్రీకుంజ్‌ హోటల్‌ జరిగిన సమావేశంలో ఉగాది వేడుకలు పర్లాకిమిడిలో ప్రవాసాంఽధ్రులు నిర్వహించేందుకు సన్నాహక సమావేశం జరిపారు. ఈ సమావేశంలో చైతన్య సమితి న్యాయసలహాదారు వి.ఎస్‌.ఎన్‌.రాజు, కన్వీనర్‌ డాక్టర్‌ రహింతుల్లా, సామినేని విశ్వప్రసాద్‌, కె.రామారావు, కోశాధికారి జి.నానాజీ, జాయింట్‌ సెక్రటరీ ఇసై వెంకటరావు, పి.వాసుదేవరావు, టి.కిశోర్‌, తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement