దేవాంగ సామాజిక వర్గీయులు ఆర్థికాభివృద్ధి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

దేవాంగ సామాజిక వర్గీయులు ఆర్థికాభివృద్ధి సాధించాలి

Mar 3 2026 7:25 AM | Updated on Mar 3 2026 7:25 AM

జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్‌

బాహిణీపతి

జయపురం: దేవాంగ సామాజికవర్గీయులు ఆర్థికంగా మరింత బలపడాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహిణీపతి ఆకాక్షించారు. జయపురం సమీప డొంగాగుడ గ్రామంలో దేవాంగ సంక్షేమ సంఘం నూతన భవననాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నిధులు రూ. ఐదు లక్షలతో నిర్మించిన భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాహిణీపతి దేవాంగ సామాజికవర్గ సంక్షేమానికి, నూతన భవనాభివృద్ధికి మరో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రస్తుత భవనం 350 దేవాంగ కుటుంబాల శుభకార్యాలకు వినియోగపడుతోందన్నారు. కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎం.అప్పారావు, కార్యదర్శి పి.శంకరరావు, ఉపాధ్యక్షులు పి.సోమరాజు, విజయనగరం సంక్షేమ సంఘం అధ్యక్షులు వి.నాని, రాయగడ సంఘ అధ్యక్షులు ఎం,శంకరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement