బంగారం, వెండికి డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

బంగారం, వెండికి డిమాండ్‌

Mar 2 2026 7:26 AM | Updated on Mar 2 2026 7:26 AM

బంగారం, వెండికి డిమాండ్‌

బంగారం, వెండికి డిమాండ్‌

పర్లాకిమిడి: బంగారం, వెండి ధరలు పెరుగుతున్నా వాటికి డిమాండ్‌ తగ్గటం లేదు. పర్లాకిమిడిలో కొత్తగా కార్పొరేట్‌ స్టయిల్లో బంగారం, వెండి షాపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరోవైపు ఉన్న పాత షాపులు కొత్తకొత్త ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. పట్టణంలో ఆదివారం రాజవీధిలో రెండు బంగారం షాపులు ప్రారంభమవ్వడంతో బంగారం, వెండి వస్తువులు కొనుగోలుకు జనాలు ఎగబడుతున్నారు. ఒకవైపు గల్ఫ్‌ దేశాలైన బహరైన్‌, సౌదీ అరేబియా, దుబాయి తదితర దేశాలపై ఇరాన్‌ బాంబుల కురిపిస్తున్న నేపథ్యంలో బంగారం ఒక్కసారిగా పెరగటంతో ప్రజలు బంగారం, వెండిపై పెట్టుబడులు పెడుతున్నారు. పట్టణంలో బంగారం ఒక గ్రాము 24 క్యారెట్‌ రూ.15,452 ధర ఆన్‌లైన్‌లో ఉండగా, పర్లాకిమిడిలో రూ.16 వేలకు పైగా పలుకుతుంది. వెండి వస్తువులు కూడా కిలో రూ. 2,95,000 ఉంది. అయినా ప్రారంభంరోజు చిన్న వస్తువు కోన్నా సిల్వర్‌ బహుమతి వుంటుందని, కిలో బంగారం కొంటే దానికి తగ్గట్టు బంగారం ఇస్తామని ప్రచారం చేయడంతో జనాలు కొనుగోలుకు ఎగబడుతున్నారు. సామాన్య ప్రజలు తమ పెట్టుబడులు బంగారం, వెండిపై పెట్టుబడులు పెడితే సమీప భవిష్యత్‌లో ఽఅధిక ధర పలుకుతుందన్న అంచనాలతో ప్రజలు కొనుగోలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement