సైక్లిస్ట్‌ను ఢీకొన్న అమొ బస్
భువనేశ్వర్: స్థానిక పలాసపల్లి ఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన అమొ బస్సు రోడ్డు ప్రమాదంలో సైక్లిస్ట్ తీవ్రంగా గాయపడటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పలాసపల్లి ఫ్లైఓవర్ కింద ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతం గుండా వెళుతున్న వృద్ధ సైక్లిస్ట్‌ను అమొ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు రక్షించి చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాదం తరువాత ఆగ్రహించిన స్థానికులు సంఘటనా స్థలంలో గుమిగూడి బస్సును ధ్వంసం చేసి వాహనంపై రాళ్లు రువ్వి కిటికీ అద్దాలను పగులగొట్టారు. గాయపడిన వ్యక్తికి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగిన స్థానికుల్ని శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
బస్సుకు నిప్పు పెట్టిన స్థానికులు


