అడవులను సంరక్షించాలి
● డీఎఫ్‌వో సచిన్ అన్నాసాహెబ్ అహోలే
రాయగడ: అడవులను సంరక్షించడం అందరి బాధ్యతని డీఎఫ్‌వో సచిన్ అన్నాసాహెబ్ అహోలే అన్నారు. స్థానిక రాణిగుడఫారం వద్ద గల డీఎఫ్‌వో కార్యాలయం సమావేశం హాల్‌లో మంగళవారం అడవుల్లో కార్చిచ్చు అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అవగాహన లోపంతో ఎంతో మంది అడవులను తగులబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీ, హరిజన ప్రాంతమైన ఈ జిల్లాలో అత్యధిక శాతం అడవులు ఉన్నాయని వాటిని సంరక్షించే విషయంలో సిబ్బంది కొరత కారణంగా అంతరించితోతున్నాయని అన్నారు. అడవులు పర్యావరణానికి ఎంతగానో దోహదపడుతున్న విషయం తెలుసుకోవాలని అన్నారు. విలువైన వృక్షాలు అంతరించిపోతున్నాయని, వన్యమృగాలు కనుమరుగువుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల అడవులను సంరక్షించే విషయంలో అందరూ చైతన్యవంతులవ్వాలని కోరారు. పోడు వ్యవసాయంతో అడవులను నాశనం చేస్తున్న వారు ఆ పద్ధతికి తిలోదకాలు పలకాలని అన్నారు. అడవుల్లో కార్చిచ్చులు సంభవించే సమయంలో సమీపంలోని గ్రామస్తులు వాటిని నియంత్రించేందుకు కృషి చేయడంతో పాటు సకాలంలో అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఏహీఎఫ్‌వోలు అశోక్ కుమార్ ప్రధాన్, సందీప్ కుమార్ పృష్టి, సంతోష్ కుమార్ ధరువ పాల్గొన్నారు.
అడవులను సంరక్షించాలి


