కొట్‌పాడ్‌ ఘఠ పర్వ్‌ ఉత్సవాలకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

కొట్‌పాడ్‌ ఘఠ పర్వ్‌ ఉత్సవాలకు శ్రీకారం

Feb 28 2026 7:39 AM | Updated on Feb 28 2026 7:39 AM

కొట్‌

కొట్‌పాడ్‌ ఘఠ పర్వ్‌ ఉత్సవాలకు శ్రీకారం

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ కొట్‌పాడ్‌లో మా శీతల ఠకురాణి ఘఠ పర్వ్‌ ఉత్సవాలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ముందుగా మా శీతలఠకురాణి దేవికి భక్తితో అంచమాల పూజలు చేశారు. కొట్‌పాడ్‌లో ప్రతి మూడేళ్లకు ఒక సారి మా శీతల ఠకురాణి ఘఠ పర్వ్‌ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కొట్‌పాడ్‌ ఘఠ జాత్రను తిలకించేందుకు చత్తీస్‌గఢ్‌, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని ఘఠ జాత్ర నిర్వాహకులు వెల్లడించారు. ఘఠ జాత్రకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని భక్తులకు తగు సౌకర్యాల ఏర్పాటు, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుల సహాయం, కొట్‌పాడ్‌లో దమయంతి సాగర్‌ ఘాట్‌ పరిశుభ్రపరచడం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది.

కొట్‌పాడ్‌ ఘఠ పర్వ్‌ ఉత్సవాలకు శ్రీకారం1
1/1

కొట్‌పాడ్‌ ఘఠ పర్వ్‌ ఉత్సవాలకు శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement