రాజమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
గార: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం వత్సవలస రాజమ్మ తల్లి (రాజరాజేశ్వరి) దర్శనానికి ఐదో ఆదివారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. కొమరవానిపేట రాజమ్మ తల్లి ఉత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడిన భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. శనివారం రాత్రికే వచ్చిన భక్తులు సమీప తోటలు, ఆరుబయట బసచేసి రాజరాజేశ్వరి (రాజమ్మతల్లి) పాటు భూలోకమ్మ తల్లిని ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. వేకువజాము నుంచే సమీపంలోని సముద్రంలో స్నానాలాచరించారు.


