కొత్తమ్మ తల్లి ఆలయం ఆదాయం రూ.6.81 లక్షలు
టెక్కలి: కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఆలయంలో ధర్మ హుండీల ద్వారా 93 రోజులకు గాను రూ.6,81,751 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ కె.గోవిందరావు, సభ్యులు బి.ప్రసాదరావు, పి.గోపి, డి.లక్ష్మణ రావు, డి.నాగరాజు, ఎ.అప్పారావు, ఎం.వెంకట్రావు సమక్షంలో శుక్రవారం హుండీ ఆదా యం లెక్కింపు నిర్వహించారు. మందసకు చెందిన ఈఓ ఎస్.నాగేశ్వరరావు పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించినట్లు ఈఓ పేర్కొన్నారు.
జిల్లా కళాకారునికి
అరుదైన గౌరవం
శ్రీకాకుళం కల్చరల్: నగరానికి చెందిన కళంకారీ కళాకారుడు ధను అంద్లూరికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా సత్కారం జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో 15రోజుల పాటు ‘కళా ఉత్సవ్–ఆర్టిస్ట్సు ఇన్ రెసిడెన్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కళంకారీ కళాకారుల బృందాన్ని ఆప్యాయంగా కలుసుకుని, వారు ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్న కళంకారి కళా ప్రక్రియను పరిశీలించారు. ఈ గౌరవం జీవితంలో ఒక స్మరణీయ ఘట్టంగా నిలిచిందని, దేశ అత్యున్నత స్థాయిలో కలంకారీ కళకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం అని ధను అంద్లూరి అన్నారు.
చెత్తను తొలగించారు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సాక్షిలో ‘నిర్లక్ష్యం ముంచెత్తగా’ అనే శీర్షికన శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు. బలగలో ఉన్న చెత్త కుప్పల్ని, డంపర్‌బిన్‌లను తొలగించి పరిశుభ్రం చేయించారు.
మహమ్మారి విస్తరిస్తోంది
శ్రీకాకుళం: నగరంలో డయేరియా మహమ్మారి విస్తరిస్తోంది. శుక్రవారం దమ్మలవీధి, మంగువారి తోట నుంచి ఒక్కొక్కరు రిమ్స్‌కు వచ్చి చికిత్స చేయించుకున్నారు. నగరంలోని బలగ, డీసీసీబీ కాలనీలో కూడా డయేరియా వ్యాధి బారిన పడుతున్నారు. బలగలో ఇప్పటివరకు ఇద్దరు వ్యాధి బారిన పడగా ఇందులో ఒకరు ఇంటి వద్దనే చికిత్స చేయించుకుంటుండగా ఓ బాలిక మాత్రం రిమ్స్‌లో చేరింది. డీసీసీబీ కాలనీకి చెందిన ఓ అబ్బాయిని కూడా ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఇల్లీసిపురం వెల్లవీధిలోని బీసీ హాస్టల్‌లో బుధవారం సాయంత్రం ముగ్గురు విద్యార్థులు డయేరియా బారిన పడగా అందులో ఇద్దరిని సోమవారం ఉదయం డిశ్చార్జి చేశారు. జి.రాజేష్ అనే విద్యార్థి మాత్రం ఇప్పటికీ రిమ్స్‌లోనే చికిత్స చేయించుకుంటున్నాడు. ప్రభు త్వ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని మూడు రోజుల కిందట వాంతు లు, విరేచనాలతో రిమ్స్‌లో చేరి డిశ్చార్జి అయ్యింది. శుక్రవారం ఉదయం మళ్లీ వాంతులు, విరేచనాలు కావడంతో రిమ్స్‌లోని ప్రత్యేక వార్డులో చేరింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 162 మంది వ్యాధిబారిన పడ్డారు.
ఐదో రోజు 289 మంది డుమ్మా
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. 5వ రోజు శుక్రవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం రెగ్యులర్ హిస్టరీ, ఒకేషనల్ సబ్జెక్టులతోపాటు గతంలో ఫెయిలైన బోటనీ, హిస్టరీ (బ్యాక్‌లాగ్) సబ్జెక్టుల విద్యార్థులు సైతం పరీక్ష రాశారు. మొత్తం మీద సెట్–1 ప్రశ్నాపత్రాలతో జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 3039 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 2749 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 289 మంది డుమ్మా కొట్టారు. మాల్ ప్రాక్టీసులు నమోదు కాలేదని జిల్లా ఆర్‌ఐఓ ఆర్.సురేష్‌కుమార్ పేర్కొన్నారు.
కొత్తమ్మ తల్లి ఆలయం ఆదాయం రూ.6.81 లక్షలు
కొత్తమ్మ తల్లి ఆలయం ఆదాయం రూ.6.81 లక్షలు
కొత్తమ్మ తల్లి ఆలయం ఆదాయం రూ.6.81 లక్షలు
కొత్తమ్మ తల్లి ఆలయం ఆదాయం రూ.6.81 లక్షలు


