గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
పర్లాకిమిడి: గజపతి జిల్లా నువాగడ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు అధిక స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, జిల్లా పరిషత్ అదనపు ముఖ్యకార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో, సబ్ కలెక్టర్ అనుప్ పండా హాజరయ్యారు. నువాగడ బ్లాక్‌లో పరిమళ, సంబల్‌పూర్, సుందర్ డంగ్, తరంగడ, తుబురుసింగి గ్రామ పంచాయతీల నుంచి 68 వినతులు అందాయి. వీటిలో గ్రామ పంచాయతీ సమస్యలకు సంబంధించినవి 50, వ్యక్తిగత ఫిర్యాదులు 18 ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించాలని బ్లాక్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నలుగురుకి మధుబాబు పథకం ద్వారా పింఛన్లు మంజూరు చేశారు. భవన కార్మికుల కుటుంబానికి మ్యారేజ్ ప్రోత్సాహాకం కింద రూ.2.50 లక్షల చెక్‌ను కలెక్టర్ అందజేశారు. నువాగడ పంచాయతీ సమితి అధ్యక్షురాలు మాలతి ప్రధాన్, బీడీఓ లోకనాథ్ బెహరా, తహసీల్దార్ మోనాలిసా ఆచారి, ఇతర బ్లాక్ అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
చంద్రపూర్‌లో..
రాయగడ: జిల్లాలోని చంద్రపూర్‌లో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశాల మేరకు సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, డీఎఫ్‌ఓ అన్నాసాహెబ్ అహోలే, ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు. చంద్రపూర్ సమితి పరిధిలో గల వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 50 వినతులను అధికారులు స్వీకరించారు. 37 వ్యక్తిగత, 13 గ్రామ సమస్యలుగా గుర్తించారు. గ్రామ సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అదనపు సంబఽంధితశాఖ అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ నాయక్ ఆదేశించారు.
చిత్రకొండ సమితిలో..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వబీమానన్ ఏరియా బోడపథర్ పంచాయతీలో సోమవారం జిల్లా కలెక్టర్ సోమేశ్ కుమార్ ఉపాధ్యాయ్ అదేశాల మేరకు జిల్లా అదనపు కలేక్టర్ వెద్బ్‌ర్ ప్రధాన్ గ్రీవెన్స్ నిర్వహించారు. 78 వినతులు స్వీకరించారు. వీటిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవల అందించడానికి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి పరిష్కరించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, వాటి వివరాలు ఆ శాఖల అధికారులతో చర్చించారు. సమితి సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ


