‘సుభద్ర’తో ఆర్థిక స్వావలంబన
● ఏడీఎం మునీంద్ర హానగ
పర్లాకిమిడి: జిల్లా స్థాయి సుభద్ర శక్తి మేళా సోమవారం నాటికి ఆరోవరోజు చేరుకుంది. మహిళా స్వశక్తీకరణ, నారీమణులు ‘లక్షపది దిద్దీ’గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం గజపతి జిల్లా స్థాయిలో వివిధ మహిళా గ్రూపుల స్టాల్స్, వారికి ఆహ్లాద పరచడానికి విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు గజపతి స్టేడియంలో ఏర్పాటు చేశారు. సోమవారం నాటి కార్యక్రమాలకు అతిధులుగా ఏడీఎం మునీంద్ర హానగ, జిల్లా పరిషత్ అదనపు కార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, బి.డి.ఓ (గుసాని) గౌరచంద్ర పట్నాయక్, జిల్లా పరిశ్రమలశాఖ జీఎం సునారాం సింగ్, జిల్లా ప్రోగ్రాం మేనేజరు, ఓ.ఎల్.ఎం టిమోన్ బోరా మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. అనంతరం బలంఘీర్ జిల్లా, గజపతి సమలై నృత్య అకాడమీ తరఫున సాంస్కృతి, జానపద నృత్యాలు ప్రదర్శించారు. భువనేశ్వర్ నుంచి సినీ గాయని బర్నాలీ హోత్తా ఆధ్వర్యంలో గ్రూప్ సంగీతం పలువురిని అలరించింది. ప్రతిరోజూ స్టేడియంలో మహిళలకు ఉచిత కంటి శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న సుభద్ర శక్వి మేళా ముగించనున్నారు.
‘సుభద్ర’తో ఆర్థిక స్వావలంబన
‘సుభద్ర’తో ఆర్థిక స్వావలంబన
‘సుభద్ర’తో ఆర్థిక స్వావలంబన


