రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి టేక్‌గూడ గ్రామ సమీపంలో గురువారం ఒక ట్రక్కు, బైక్‌ను ఢీకొనడంతో నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. సంతోష్ గౌడ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కోరుకొండకు సుదశా వత్రం కోసం వచ్చారు. పూజ అనంతరం ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం తరలించారు. విషయం తెలుసుకున్న కోరుకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు ఫోన్ల అందజేత
జయపురం: జయపురం మునిసిపాలిటీలో పారిశుద్ధ్య శ్రామికులకు మునిసిపాలిటీ అధికారులు ఫోనులు సమకూర్చారు. గరిమ యోజనలో పట్టణ పారిశుద్ధ్య వ్యవస్థ మరింతగా మెరుగుపరిచే లక్ష్యంతో ఫోన్లు అందజేశారు. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి పాల్గొన్నారు. మునిసిపాలిటీ సెప్టిక్ ట్యాంక్‌లు పరిశుభ్రపరచే శ్రామికులు 11 మందికి జియో ఫోన్లు అందజేశారు. వారికి ఫోనులు సమకూర్చటం వలన ఎప్పపటికప్పుడు వారి పనితీరును, వారు ఎక్కడ ఉన్నది తెలుసుకునేందుకు వీలు అవుతుందన్నారు. వైస్‌చైర్మన్ బి.సునీత, మునిసిపాలిటీ అదనపు కార్యనిర్వాహక అధికారి పూజా రౌత్, కౌన్సిలర్లు జస్‌పాల్ సింగ్, సింహాచల బిశాయి, తదితరులు పాల్గొన్నారు.
దుర్గా మందిరంలో చోరీ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రం దుర్గగుడి వీధిలోని దుర్గా మందిరంలో బుధవారం రాత్రి అమ్మవారి నగలు చోరీకి గురయ్యాయి. గురువారం ఉదయం 7 గంటలకు పూజారి ఆలయానికి ఉన్న గేటు విరిగి ఉంది. దీంతో పూజారి ఆలయం పక్కనే ఉన్న వారిని పిలిచి కమిటీకి సమాచారం అందజేశారు. అంతా కలిసి మల్కన్‌గిరి పోలీసుస్టేషన్‌లో ఐఐసీ రీగాన్ కీండోకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయం వద్దకు వచ్చి పరిశీలించగా అక్కడ అమ్మవారి మంగళసూత్రాలు, రెండు హారాలు, ముక్కు నత్తు పోయినట్లు గుర్తించారు. 70 ఏళ్ల ఆలయ చరిత్రలో తొలిసారి దొంగతనం జరిగిందని స్థానికులుచెబుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు
రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు
రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు
రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు


