అన్నదాతల ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల ఆగ్రహం

Feb 27 2026 4:17 AM | Updated on Feb 27 2026 4:17 AM

అన్నద

అన్నదాతల ఆగ్రహం

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి కేంద్రంలో గురువారం రైతులు మండీలో ధాన్యం ఎత్తకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మండీ నిర్వహణ, ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పరిపాలనపై వ్యతిరేకంగా రాష్ట్రంలో కూడా పలు చోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. గురువారం బస్తాలను రోడ్డుపై ఉంచి ధర్నా చేశారు. మండీల నుంచి ధాన్యాన్ని ఎత్తివేయాలని, ఖాళీ సంచులకు డబ్బులివ్వాలని, తూకం తగ్గింపు ఆపాలని, మిల్లర్ల అన్యాయాలను కోరారు. రైతుల ఆందోళనతో రహదారి స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న జిల్లా అదనపు సరఫరా అధికారి విశ్వజిత్‌ దాస్‌, అదనపు తహసీల్దార్‌ ఉమేష్‌ పూజారి, కోరుకొండ ఎంఐ హరీష్‌ రామ్‌ మల్లిక్‌ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు.

అన్నదాతల ఆగ్రహం 1
1/1

అన్నదాతల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement