రు.200 కోట్ల గంజాయి ఆయిల్‌ పరిశ్రమ స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రు.200 కోట్ల గంజాయి ఆయిల్‌ పరిశ్రమ స్వాధీనం

Feb 27 2026 4:17 AM | Updated on Feb 27 2026 4:17 AM

రు.20

రు.200 కోట్ల గంజాయి ఆయిల్‌ పరిశ్రమ స్వాధీనం

కొరాపుట్‌: గంజాయి ఆయిల్‌ ఉంటుందనేది ఊహాజనితం. కానీ అనుష్క ప్రధాన పాత్ర లో ఘాటీ తెలుగు సినిమాలో ఈ గంజాయి ఆయిల్‌ తయారి చూపించారు. ఊహించని విషయం ఏంటంటే ఘాటీ సినిమా చిత్రీకరణ చేసిన దండకారణ్యం లో కొరాపుట్‌ జిల్లాలోనే ఆదే సినిమాని తలపిస్తూ గంజాయి ఆయిల్‌ తయారీ పరిశ్రమను స్మగ్లర్లు నిర్వహించారు. గురువారం కొరాపుట్‌ జిల్లా పాడువా ప్రాంతంలో జోలాపుట్‌ జలాశయం మధ్యలో పోలీసులు దాడి చేసి ఈ పరిశ్రమని స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిశ్రమ వద్దకి చేరుకోవడానికి ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. స్మగ్లర్లు పడవల మీద ఇక్కడకి చేరుకొని గంజాయి ఆయిలు తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా రసాయన శాస్త్రవేత్తల సహయ సహాకారాలు తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొరాపుట్‌ ఎస్పీ రోహిత్‌ వర్మ ప్రత్యేక పోలీసు బలగాలతో బోట్‌లతో పరిశ్రమ ఉన్న కటాఫ్‌ ప్రాంతానికి వెళ్లారు. ఎస్పీతో ఉన్న బలగాలకు కూడా తాము ఎక్కడికి వెళ్తున్నామనే విషయం తెలియక పోవడం గమనార్హం. డీవీఎఫ్‌ దళాలతో పరిశ్రమ ఉన్న ఐలాండ్‌ పై దిగారు. వీరిని చూసిన గంజాయి స్మగ్లర్లు పరారయ్యారు. పోలీసులు ఐలాండ్‌ లో గాలింపులు చేయగా 1,800 లీటర్ల గంజాయి ఆయిల్‌ పట్టుబడింది. ఈ ఆయిల్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌ లో రు.200 కోట్లు ఉంటుందని ఎస్పీ రోహిత్‌ వర్మ ప్రకటించారు. అత్యున్నత స్థాయి ప్రమాణాలతో గంజాయి ఆయిల్‌ తయారి పరిశ్రమ చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ దాడి విషయం ఎకై ్సజ్‌ పోలీసులకు తెలియక పోవడం గమనార్హం.

రూ.5 కోట్ల విలువ గల గంజాయి స్వాధీనం

కొరాపుట్‌ జిల్లా పోలీసులు మరో ఘటనలో రూ.5 కోట్ల విలువ గల గంజాయి పట్టుబడింది. గురువారం నందపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్‌డీపీఓ సుమిత్ర జెన్న ఈ కేసు వివరాలు ప్రకటించారు. కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ వైపు వస్తున్న రెండు పికప్‌ వాహనాలను నందపూర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముచింపుట్‌ నుంచి వస్తున్న ఈ వాహనాలు హర్యానా వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వాహనాల్లో 1143 కేజీల గంజాయి సీజ్‌ చేశారు. నిందితుల్లో హర్యానా వాసులు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ దాడిపై సదరన్‌ వెస్ట్రన్‌ రేంజ్‌ ఐజీ కన్వర్‌ విశాల్‌ సింగ్‌ పోలీసులను అభినందించారు.

రు.200 కోట్ల గంజాయి ఆయిల్‌ పరిశ్రమ స్వాధీనం 1
1/2

రు.200 కోట్ల గంజాయి ఆయిల్‌ పరిశ్రమ స్వాధీనం

రు.200 కోట్ల గంజాయి ఆయిల్‌ పరిశ్రమ స్వాధీనం 2
2/2

రు.200 కోట్ల గంజాయి ఆయిల్‌ పరిశ్రమ స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement