ఆధ్యాత్మిక సదస్సులో పాణిగ్రాహికి సత్కారం | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక సదస్సులో పాణిగ్రాహికి సత్కారం

Feb 25 2026 7:06 AM | Updated on Feb 25 2026 7:06 AM

ఆధ్యా

ఆధ్యాత్మిక సదస్సులో పాణిగ్రాహికి సత్కారం

భువనేశ్వర్‌: స్థానిక క్రిస్టల్‌ క్రౌన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఆధ్యాత్మిక సదస్సులో హై టెక్‌ గ్రూప్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ తిరుపతి పాణిగ్రాహిని రాసేశ్వరిదేవి ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సదస్సులో పూరీ రాధా వల్లభ మఠం మహంత్‌ రామకృష్ణ దాస్‌, స్వామి శంకరానంద గిరి, స్వామి సత్యానంద మహరాజ్‌, స్వామి సుబల్‌ మహరాజ్‌ తదితర ప్రముఖులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ తిరుపతి పాణిగ్రాహి మాట్లాడుతూ.. ప్రతి మనిషికి ఆధ్యాత్మిక జీవితమే తొలి మెట్టు కావాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మికత మనిషి జీవితాన్ని క్రమబద్ధీకరిస్తుందని అన్నారు.

200 లీటర్ల నాటుసారా స్వాధీనం

రాయగడ: జిల్లాలోని మునిగుడలో అబ్కారీ శాఖ అధికారులు విస్తృతదాలు చేపటాటరు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం సాయంత్రం ఆ శాఖ సిబ్బంది సమితి పరిధిలోని ఇచ్ఛాపూర్‌ సమీపంలో ఒడిమస్కా గ్రామంలో దాడులను నిర్వహించి అక్రమంగా తయారు చేస్తున్న 200 లీటర్ల నాటుసారాతో పాటు 1200 లీటర్ల సారా తయారీకి వినియోగించే ఊటను స్వాధీనం చేసుకున్నారు. మునిగుడ అబ్కారీ శాఖ ఏఎస్సై రామజాన్‌ ఖాన్‌ నేతృత్వంలో దాడులు జరిగాయి.

14న జాతీయ లోక్‌ అదాలత్‌

జయపురం: జాతీయ న్యాయ సేవా ప్రదీకరణ, ఒడిశా రాష్ట్రన్యాయ సేవా ప్రదీకరణల మార్గదర్శకత్వంలో మార్చి 14వ తేదీన కొరాపుట్‌ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం ఆధ్వర్యంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా న్యాయ ప్రదీకరణ కార్యదర్శి మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జయపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో లోక్‌ అదాలత్‌తోపాటు కొరాపుట్‌, కొట్‌పాడ్‌, బొరిగుమ్మ, సెమిలిగుడ, దసమంతపూర్‌, అమతాపుట్‌, లక్ష్మీపూర్‌ ప్రాంతాలలో ఉన్న అన్ని కోర్టులలోనూ లోక్‌అదాలత్‌లు నిర్వహించన్నుట్లు వెల్లడించారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో సివిల్‌, క్రిమినల్‌, మోటారు ప్రమాదాలు, బ్యాంక్‌ రుణాలు, విద్యుత్‌, నీటిసరఫరా బకాయిలు, కుటుంబ వివాదాలు, భూ సేకరణ, కార్మిక, ఉద్యోగ వివాదాలు, చెక్‌ బౌన్స్‌, రెవెన్యూ, వినియోగదారులు, ఉద్యోగ సంబంధిత కేసులు పరిష్కరిస్తామని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న కేసులే కాకుండా ఇంకా కోర్టులలో దాఖలు కాని ప్రీ–లిటిగేషన్‌ (పూర్వ వివాద) కేసులు కూడా లోక్‌ అదలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంతో కేసులు పరిస్కరించుకోచ్చన్నారు.

ఆధ్యాత్మిక సదస్సులో  పాణిగ్రాహికి సత్కారం 1
1/1

ఆధ్యాత్మిక సదస్సులో పాణిగ్రాహికి సత్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement