భూగర్భజలాలు అంతరించకుండా చర్యలు తీసుకోవాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో భూగర్భజలాల స్థాయి కొన్ని ప్రాంతాల్లో అతి తక్కువగా ఉంది, ఇవి అడుగంటకుండా చర్యలు తీసుకోవాలని జిల్లాలోని అధికారులకు కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ సూచించారు. ఆయన జాతీయ భూగర్భజలాలు మానచిత్రాలు, వాటి నిర్వహణ వర్క్‌షాపు స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం ప్రారంభించారు. కేంద్ర జలశక్తి, నీటి వనరులు, నదుల అనుసంధానం ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్‌షాపులో చిన్ననీటి పారుదల శాఖ ఎస్‌ఈ సింహాచల శతపతి, జిల్లా పరిషత్ అదనపు సీడీఓ పృథ్వీరాజ్ మండల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంశుమాన్ మహాపాత్రో, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సైంటిస్టు చరణశ్రీ మహాంతి, కేంద్ర జలశక్తి, నీటివనరుల శాఖ, సీనియర్ సైంటిస్టు రాజకిషోర్ మహాంతి తదితరులు పాల్గొన్నారు. ఆకాంక్ష జిల్లాగా గజపతి జిల్లా గుర్తించిన తరువాత భూగర్భజలాలపై 2025లో సర్వేచేయడం జరిగిందని, దీనిప్రకారం మోహన బ్లాక్‌లో బిరికోట్, కాశీనగర్ బ్లాక్ కిత్తంగి, మధుసూదన్‌పూర్ (గుసాని)లో భూగర్భజలాలు రోజురోజుకూ తగ్గుదల కనిపిస్తుందని వైజ్ఞాణికులు రాజకిషోర్ మహాంతి పవర్ ప్రజెంటేషన్‌లో పేర్కోన్నారు. భూమిలో ఫ్లోరైడ్, నైట్రేట్ ఉన్నందున భూగర్భజలాలు అంతరించడానికి ముఖ్య కారణంగా ఆయన కర్మశాలలో తెలియజేశారు. జిల్లాలో భూగర్భ జలాలు అంతరించపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో వైజ్ఞానికుల సలహాలు తీసుకోవాలని, అలాగే సాగు, తాగునీరు స్టోరేజి, రిజర్వాయర్లు నిర్మించాలని కలెక్టర్ అగర్వాల్ ప్రభుత్వ అధికారులను కోరారు. ఈ సందర్భంగా జిల్లాలో భూగర్భ జలాల వనరులపై ఈ ప్రాంతంలో పరిశోధనలు చేసి వాటిపై తయారు చేసిన సర్వే రిపోర్టును కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ ఆవిష్కరించారు. వర్క్‌షాపులో రోడ్లు–భవనాల శాఖ, ప్రజా ఆరోగ్యశాఖ, వాటర్ షెడ్ అభివృద్ధిశాఖ అధికారి సురేష్ పట్నాయిక్, ఇరిగేషన్, గ్రామీణ త్రాగునీరు, శానిటేషన్,గ్రౌండ్ వాటర్ అభివృధ్ధి శాఖ, వివిధ సమితిల అధికారులు పాల్గొన్నారు.
భూగర్భజలాలు అంతరించకుండా చర్యలు తీసుకోవాలి
భూగర్భజలాలు అంతరించకుండా చర్యలు తీసుకోవాలి


