జెడ్పీ సమావేశంలో సమస్యల ప్రస్తావన | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ సమావేశంలో సమస్యల ప్రస్తావన

Feb 28 2026 7:09 AM | Updated on Feb 28 2026 7:09 AM

జెడ్ప

జెడ్పీ సమావేశంలో సమస్యల ప్రస్తావన

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పరిషత్‌ 75వ సాధారణ సమావేశం జెడ్పీ అధ్యక్షురాలు సమారి టాంగులు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు వారి ప్రాంతానికి చెందిన సమస్యలను ప్రస్తావించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ సోమేశ్‌ కుమార్‌ ఉపాధ్యాయ్‌ మాట్లాడుతూ.. సభ్యులు లేవనెత్తి సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ పట్టాల్లో లోపాలను సరిదిద్దుతూ లబ్ధిదారులకు సరైన పట్టాలు అందించాల్సిన అవసరాన్ని సమారీ టాంగులు ప్రస్తావించారు . జిల్లాలో సూక్ష్మ పరిశ్రమల స్థాపన కోసం జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. పీఎంఈజీపీ పథకం కింద గ్రామీణ ప్రాంతాలకు 35 శాతం, పట్టణ ప్రాంతాలకు 25 శాతం సబ్సిడీ లభిస్తుందని అన్నారు. జిల్లాలో డ్రాపవుట్‌ రేటును తగ్గించేందుకు హాస్టల్‌ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో చర్చించారు. రోడ్లు, ఆరోగ్యం, మంచినీరు, విద్యుత్‌పై సమావేశంలో చర్చించారు. జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడు పతిత పావన్‌, వైద్య, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్‌, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దాశరధి సరాబు పాల్గొన్నారు.

జెడ్పీ సమావేశంలో సమస్యల ప్రస్తావన1
1/1

జెడ్పీ సమావేశంలో సమస్యల ప్రస్తావన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement