ఘనంగా పల్లకీసేవ
పాలనలో బీజేపీ విఫలం బీజేపీపై నవీన్ విమర్శలు ఎక్కుపెట్టారు. పాలనలో విఫలమైందన్నారు. –8లోu
● జేకేపూర్‌లో కొనసాగుతున్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
రాయగడ: పారిశ్రామిక ప్రాంతమైన జేకేపూర్‌లో కొలువైయున్న శ్రీభూసమేత కళ్యాణ వేంకటేశ్వర స్వర్ణోత్సవాల్లో భాగంగా సొమవారం సాయంత్రం స్వామి వారి ఉత్సవమూర్తులను పల్లకీలొ ఊరేగించారు. ఆలయ అర్చకులతో పాటు, బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా విశాఖపట్నం, బరంపురం నుంచి విచ్చేసిన పురోహితుల మంత్రోచ్ఛరణల మధ్య గోవింద నామ స్మరణాలతో స్వామివారిని ఊరేగించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని పునీతులయ్యారు.
విశ్వక్షేన పూజలు
ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం విశ్వక్షేన పూజలను నిర్వహించారు. జి.శేషాచార్యులు ఈ సందర్భంగా పూజా విశిష్టతను వివరించారు. అనంతరం స్వామి వారికి మంగళహారతులను ఇచ్చారు. పుణ్యాహావాచనం, పరిషత్, రక్షాసూత్రా బంధనం, రుత్విక్ వరుణ, ముత్సంగ్రహణం తదితర పూజల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పట్టు వస్త్రాల సమర్పణ
ప్రముఖ సంఘసేవకుడు, శ్రీక్షేత్ర టౌన్‌షిప్ అధినేత, శ్రీలక్ష్మీనృసింహ స్వామి మందిరం ధర్మకర్త దూడల శ్రీనివాస్ దంపతులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన పూలను స్వామి వారికి సమర్పించారు. అదేవిధంగా లక్ష్మీ,ధరణి, వేంకటేశ్వరులకు పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామివారి ఉత్సవాల్లో పట్టువస్త్రాలను సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని శ్రీనివాస్ తెలిపారు. అనంతరం మందిరం కమిటీ అధ్యక్షులు, జేకేపేపర్ మిల్ ఉపాధ్యక్షులు (కమర్షియల్) వినయ్ ద్వివేది స్వామి వారిసేవలొ నిమగ్నమయ్యారు. స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పురోహితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. కొంతమంది విదేశీయులు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.


