మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
రాయగడ: యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉంటేనే వారి భవిష్యత్ ఉజ్వలంగా మారుతోందని జిల్లా సామాజిక సురక్షా అధికారి శ్రీకాంత్ పాణిగ్రహి అన్నారు. సదరు సమతి కొమట్లపేటలోని ఉగ్రతార ఉన్నత పాఠశాలలో ‘మత్తుపదార్థాలు–యువతపై ప్రభావం’ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తుకు బానిసకాకూడదని అన్నారు . మత్తు వల్ల వారి భవిష్యత్ చిత్తయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి


