జయపురం: జయపురం సబ్ డవిజన్ కోట్‌పాడ్ కమ్యూనిటీ హాస్పిటల్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. కోట్‌పాడ్ ఎన్‌ఏసీ చైర్మన్ ఎం.శంకరరావు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక హెచ్‌పీవీ వ్యాక్సిన్ ధర బహిరంగ మార్కెట్లో రూ.5 వేల నుంచి రూ.10 వేలు వరకు ఉంటుందన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని వెల్లడించారు. కార్యక్రమంలో నవరంగపూర్ ఎంపీ ప్రతినిధి రామేశ్వర జెన, కోట్‌పాడ్ ఎమ్మెల్యే ప్రతినిధి సురేష్ మహంతి, కోట్‌పాడ్ వైద్యాధికారి రంజన్ దాస్, ప్రెస్‌క్లబ్ కార్యదర్శి, న్యాయవాది పంకజ కుమార్ పాత్రో తదితరులు పాల్గొన్నారు.


