మల్కన్‌గిరిలో ఉత్కళ సమ్మిళిని రాష్ట్ర అధ్యక్షుడు పర్యటన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో ఉత్కళ సమ్మేళన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అధ్వైత్ కుమార్ పాత్రో, ఉపాధ్యక్షుడు డాక్టర్ సుబ్రత్ కుమార్ సాహు, ఇతర రాష్ట్ర స్థాయి ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు. ముందుగా స్థానిక సర్క్యూట్ హౌస్‌కు చేరుకొని మధుసూదన్ దాస్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధన్‌తో రాష్ట్ర అధ్యక్షుడు అధ్వైత్ కుమార్ పాత్రో చర్చించారు. జిల్లాకు రైల్వే అనుసంధానం, ఆదివాసీ భాషల పరిరక్షక్షణ, వినియోగం, స్వాభిమాన ప్రాంత అభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల సరైన అమలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పద్మనాభ సామల్, కమల్ చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి అక్షయ్ కుమార్ దాస్, కేంద్ర సభ్యుడు రవీంద్ర బెఉరియా, జిల్లా శాఖ అధ్యక్షుడు దుష్మంత్ కుమార్ జెనా, జిల్లా ఉపాధ్యక్షుడు లంభోధర్ తురుక్, జిల్లా కార్యదర్శి అశోక్ మిశ్రో, ఇతర సభ్యులు ఉన్నారు.


