హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం

Mar 2 2026 7:26 AM | Updated on Mar 2 2026 7:26 AM

హెచ్‌

హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఆదివారం ఉదయం 10 గంటలకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్‌ మాడ్కమి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్‌ సోమేశ్‌ ఉపాధ్యాయ్‌, జెడ్పీ అధ్యక్షురాలు సమారి టాంగులు, ఎంపీ ప్రతినిధి సంజయ్‌ సర్కార్‌, జిల్లా వైద్యాధికారి డోలామణి ప్రధాన్‌, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చౌధురీ నిహర్‌ రంజన్‌ ప్రహరాజ్‌, అదనపు వైద్యాధికారి డాక్టర్‌ సౌభాగ్య రంజన్‌ రణసింగ్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ టీకాను 14–15 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆరోగ్యవంతమైన బాలికలకు మాత్రమే ఇస్తారు. ఈ టీకా కార్యక్రమం 3 నెలలు పాటు జిల్లా ఆస్పత్రి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది. తొలి దశలో ప్రధాన ఆస్పత్రిలో రెండో దశలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విస్తరిస్తారు. వయసు నిర్ధారణ కోసం ఆధార్‌, స్కూల్‌ ఐడీ తీసుకురావాల్సి ఉంటుంది.

హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం1
1/1

హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం

Advertisement
 
Advertisement
Advertisement