1025 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

1025 కిలోల గంజాయి పట్టివేత

Feb 24 2026 7:00 AM | Updated on Feb 24 2026 7:00 AM

1025

1025 కిలోల గంజాయి పట్టివేత

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఆదివారం రాత్రి ఎంవీ 96 గ్రామం జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఓ ట్రక్కును గమనించారు. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 41 ప్లాస్టిక్‌ సంచుల్లో గంజాయిని గుర్తించి వెంటనే డ్రైవర్‌ను అరెస్టు చేశారు. సోమవారం విచారించగా పట్టుబడిన గంజాయిని నిందితుడు హైదరాబాద్‌ తరలిస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్‌ ఝాబర్‌ సింగ్‌ రాజస్థాన్‌ నుంచి వచ్చాడు. గంజాయిని తూకం వేయగా 1025 కిలోలు ఉంది. దీని విలువ రూ.80 లక్షలు వరకుం ఉంటుందని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఆర్‌ఎంసీ ఉద్యోగి మృతి

రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌ ఆర్‌ఎంపీలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న పితబాస్‌ రౌత్‌ (42) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని బిసంకటక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మీనాహల్‌ గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గుణుపూర్‌ సబ్‌ డివిజన్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుణుపూర్‌లో గల ఆర్‌ఎంసీ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్న పితాబస్‌ బిసంకటక్‌లో గల ధాన్యం మండీల కేంద్రానికి వెళ్లి పనులు ముగించుకుని తిరిగి గుణుపూర్‌కు వస్తుండగా బిసంకటక్‌ మీనాహాల్‌ వద్ద ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను బలంగా ఢీ కొన్నాడు. ఈ ఘటనలో అతడు తీవ్రగాయాలకు గురయ్యాడు. అటువైపుగా వెళ్లే కొందరు గాయాలతో ఉన్న అతడిని బిసంకటక్‌లో గల క్రిష్టియన్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్సను అందించిన వైద్యులు అప్పటికే పితాబస్‌ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అంబుబులెన్స్‌ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు.

మా నక్టిమా జాతర ప్రారంభం

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో ఆదివారం నుంచి స్థానిక మానక్టిమా అమ్మవారి జాతర ప్రారంభమైంది. ఆదివారం రాత్రి భారీ ఊరేగింపుతో అమ్మవారిని మౌలిమ మందిరం వద్ద నుంచి తెచ్చి నక్టిమా ఆలయం వద్ద మూడు రోజుల జాతర నిర్వహిస్తారు. వేలాది మంది ఘటాలతో వచ్చి అమ్మవారిని మొక్కుకున్నారు. మెయిన్‌ రోడ్డులో అమ్మవారిని పల్లకీపై మోశారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆలయం వద్దకు చేరుకున్నారు. మంగళవారం వరకు జాతర నిర్వహిస్తారు.

1025 కిలోల గంజాయి పట్టివేత 1
1/3

1025 కిలోల గంజాయి పట్టివేత

1025 కిలోల గంజాయి పట్టివేత 2
2/3

1025 కిలోల గంజాయి పట్టివేత

1025 కిలోల గంజాయి పట్టివేత 3
3/3

1025 కిలోల గంజాయి పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement