భక్తి శ్రద్ధలతో ఏకాదశి పూజలు
రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని ల్యాణవేంకటేశ్వర స్వామి మందిరంలో ఫాల్గుణ మాసం శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో మందిరం ప్రాంగణంలో శ్రీరమా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సెపక్ తక్రా పతక విజేతకు సత్కారం
భువనేశ్వర్: శ్రీలంకలో జరిగిన ఆసియా సెపక్ టక్రావ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా, పురుషుల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలో భారత జట్టు 3 బంగారు పతకాలు గెలుచుకుంది. ఒడిశాకు చెందిన ఆకాష్ కుమార్ రెడ్డి స్వర్ణ పతకం సాధించాడు. ఒడిశాకు కీర్తిని చాటిన ఆకాష్ కుమార్ రెడ్డిని హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఒడిశాలో సెపక్ తక్రా క్రీడను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సెపక్ తక్రా క్రీడా సంస్థ ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ సాహు పాల్గొన్నారు.
రేపు ఎస్‌కేజీసీ కాలేజీలో యూత్ పార్లమెంట్
పర్లాకిమిడి: కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు స్థానిక శ్రీకృష్ణచంద్రగజపతి (స్వయంప్రతిపత్తి) కళాశాలలో మార్చి 1న యూత్ పార్లమెంటు నిర్వహిస్తున్నట్టు కళా శాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాధాకాంత భుయ్యాన్ తెలియజేశారు. శుక్రవారం కళాశాల కౌన్సిలింగ్ హాల్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ప్రొఫెసర్ రాధాకాంత భుయ్యాన్ మాట్లాడారు. తొలిసారిగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంటుకు జిల్లాలో కాశీనగర్, గుమ్మ, మోహన, పర్లాకిమిడి మహిళా కళాశాలల నుంచి 18 నుంచి 25 ఏళ్ల లోపు విద్యార్థులు 150 మందికి పైగా పాల్గొంటున్నారని, వీరిలో ఉత్తమంగా మాట్లాడిన యువ పార్లమెంటీరియన్లు రాష్ట్ర స్థాయికి ఎంపికవుతారని ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం అధికారి బిధ్యాధర్ శెఠి అన్నారు.
భక్తి శ్రద్ధలతో ఏకాదశి పూజలు


