మావో స్థూపాలు ధ్వంసం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వభీమాన్ ఏరియతోపాటు కలిమెల, మాత్తిలి, ఖోయిర్‌పూట్ ప్రాంతాల్లో మావోలు నిర్మించిన స్థూపాలను గురువారం గిరిజనులు ధ్వంసం చేశారు. ముఖ్యంగా చిత్రకొండ సమితి జోడాంబో పంచాయతీలో ఖజూర్‌గూడ ప్రాంతంలో ఉన్న స్థూపం, ఘెనుబెడ గ్రామంలో ఉన్న స్థూపాన్ని కూల్చివేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మావోయిస్టులు పూర్తిగా లేరన్నారు. గ్రామస్తులంతా కలిసి ఇక మన భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకోవాలని, మనకు మావోలతో భయం లేదన్నారు. ఈ నిర్మాణాలు మనకు వద్దని సభలో నిర్ణయించుకుని 20 స్థూపాలను ధ్వంసం చేశారు. ఒకప్పుడు మావోయిస్టుల అడ్డగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు పూర్తిగా మావోల చర నుంచి బయటబడ్డాయి. ఇక్కడ గిరిజనులు భయం వదిలి ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఈ ప్రాంతాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. పోలీసు శాఖ చేసిన కృషితో మావోలను తరిమికోట్టారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ వినోద్ పటేల్ మాట్లాడుతూ ప్రజలు సంఘర్షణ కంటే అభివృద్ధి, శాంతి అవకాశాలను కోరుకుంటున్నారని తెలిపారు.
మావో స్థూపాలు ధ్వంసం


