జయపురం: జయపురం రీజనల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (ఆర్.సి.ఎం.ఎస్) వార్షిక బడ్జెట్ సమావేశం ఉమ్మిరి సమీప తెలిగుడ గ్రామంలోని సొసైటీ కార్యాలయంలో సోమవారం జరిగింది. రీజనల్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు సుకాంత త్రిపాఠీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్.సి.ఎం.ఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. త్రిపాఠీ వార్షిక నివేదికను వివరించారు. నూతన ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. 2026–27 వార్షిక బడ్జెట్‌ను సమావేశం ఆమోదించింది. బడ్జెట్‌లో ఆర్‌సిఎంఎస్ కార్యాలయ ప్రాంతంలో స్టాల్స్ నిర్మాణం, ఖాళీ స్థలం పంపిణీపై చర్చించారు. స్టాల్స్ కోసం ఎవరు దరఖాస్తు పెట్టుకుంటారో వారి నుంచి సెక్యూరిటీ వసూలు చేసి వాటితో ఆర్‌ి.ఎం.ఎస్ స్టాల్స్ నిర్మించాలని సమావేశం తీర్మానించింది. ఈ సమాపంలో సుదీప్ పదార్, ట్వింకిల్ మిశ్రా, అరుణ భటమిశ్రా, సుభాష్ సాహూ తదితరులు పాల్గొన్నారు.


