విద్యార్థులకు వక్తృత్వ పోటీలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు వక్తృత్వ పోటీలు

Mar 1 2026 7:29 AM | Updated on Mar 1 2026 7:29 AM

విద్యార్థులకు వక్తృత్వ పోటీలు

విద్యార్థులకు వక్తృత్వ పోటీలు

రాయగడ: జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సాయిప్రియ లేడీస్‌ వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సాయిప్రియనగర్‌లోని ఎన్‌.వి.ఆర్‌.విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఆరు, ఎనిమిదో తరగతి విద్యార్థులకు వేర్వేరుగా పోటీలు జరిగాయి. కంట్రిబ్యూషన్‌ ఆప్‌ ఇండియన్‌ సైంటిస్ట్స్‌ టు ద వరల్డ్‌ అనే అంశంపై ఆరో తరగతి విద్యార్థుల మధ్య నిర్వహించిన పోటీలో మొదటి బహుమతిని ప్రణయ మాఝి, ద్వితీయ బహుమతిని బి.ప్రజిషా, తృతీయ బహుమతిని శుభం మిశ్రాలు గెలుచుకోగా ప్రోత్సాహక బహుమతిని పుటుల్‌ బాగ్‌ దక్కించుకున్నారు. అలాగే ఎనిమిదో తరగతి విద్యార్థుల మధ్య బిహైండ్‌ ఎవిరీ డిస్కవరీ–దెరీజ్‌ ఎ ఉమెన్‌ సైంటిస్ట్‌ అనే అంశంపై నిర్వహించిన పోటీల్లొ ప్రధమ బహుమతిని విక్టోరియా కడైసిక గెలుచుకోగా ద్వితీయ బహుమతిని రాణి బ్రెడిక, తృతీయ బహుమతిని సుప్రియ క్రితంగ దక్కించుకున్నారు. ప్రోత్సాహక బహుమతి భారతీ బ్రెడకకు లభించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్‌ లక్ష్మీ నారాయణ సాహు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. క్లబ్‌ అధ్యక్షురాలు పొట్టాం రామాదేవి, కార్యదర్శి మాధురి, కోశాధికారి నిర్మల పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement