అగ్రస్థానంలో భారత్‌ | - | Sakshi
Sakshi News home page

అగ్రస్థానంలో భారత్‌

Mar 2 2026 7:26 AM | Updated on Mar 2 2026 7:26 AM

అగ్రస

అగ్రస్థానంలో భారత్‌

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026
2047కు ముందే

ఎస్పీ జ్యోతింద్ర కుమార్‌ పండా

పర్లాకిమిడి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్‌ భారత్‌ 2047 పిలుపుతో మన యువతరం 2036 నాటికే ప్రపంచంలో మనం అగ్రస్థానంలో నంబర్‌ వన్‌గా భారత్‌ నిలుస్తుందని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా అభిప్రాయపడ్డారు. ఆయన స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి స్వయం ప్రతిపత్తి కళాశాలో ఆదివారం ఉదయం యూత్‌ పార్లమెంట్‌ను జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ వక్తృత్వానికి న్యాయ నిర్ణేతలుగా డాక్టర్‌ రంజిత్‌ కుమార్‌ పతి, విశ్రాంత అధ్యాపకులు సురేంద్ర కుమార్‌ రథ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్‌ సుభ్రత్‌ కుమార్‌ చౌదురీ, ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ రాధాకాంత భుయ్యాన్‌, ఎన్‌.యస్‌.యస్‌.నోడల్‌ ఆధికారి డాక్టర్‌ సన్యాసి బెహరా, కోఆర్డినేటర్‌ (ఎన్‌.యస్‌.యస్‌.) భిఘ్నేశ్వర్‌ మిశ్రా, సుమంత్‌ బెహరా తదితరులు పాల్గొన్నారు. ‘50 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ కాలంలో భారతీయ రాజ్యాంగంపై మనం తెలుసుకోవాల్సిన పాఠాలు’ అన్న అంశంపై స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ను నిర్వహించారు. ఈ యూత్‌ పార్లమెంట్‌కు సెంచూరియన్‌ వర్సిటీ విద్యార్థులు, శ్రీరాండిగ్రీ కళాశాల, కాశీనగర్‌, హిల్‌టాప్‌ కళాశాల, మోహనా, మహిళా కళాశాల విద్యార్థినులు హాజరై మాట్లాడారు. జూన్‌ 25, 1975న జరిగిన అత్యవసర స్థితిపై విద్యార్థిని ఎ.శరణ్య డిబేటింగ్‌లో అన్నారు. 22 నెలలపాటు సాగిన అప్పటి ఎమర్జెన్సీపై పలువురు వక్తలు మాట్లాడారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

అగ్రస్థానంలో భారత్‌1
1/5

అగ్రస్థానంలో భారత్‌

అగ్రస్థానంలో భారత్‌2
2/5

అగ్రస్థానంలో భారత్‌

అగ్రస్థానంలో భారత్‌3
3/5

అగ్రస్థానంలో భారత్‌

అగ్రస్థానంలో భారత్‌4
4/5

అగ్రస్థానంలో భారత్‌

అగ్రస్థానంలో భారత్‌5
5/5

అగ్రస్థానంలో భారత్‌

Advertisement
 
Advertisement
Advertisement