‘హరదీప్‌ సింగ్‌ పురిని తొలగించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘హరదీప్‌ సింగ్‌ పురిని తొలగించాలి’

Feb 27 2026 4:11 AM | Updated on Feb 27 2026 4:11 AM

‘హరదీప్‌ సింగ్‌ పురిని తొలగించాలి’

‘హరదీప్‌ సింగ్‌ పురిని తొలగించాలి’

భువనేశ్వర్‌: అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ పిలుపు మేరకు ఒడిశా ప్రదేశ్‌ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మీనాక్షి బాహినీపతి ఆధ్వర్యంలో స్థానిక మాస్టర్‌ క్యాంటీన్‌ కేంద్ర మంత్రి హరదీప్‌ సింగ్‌ పురి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఎపిస్టిన్‌తో సంబంధాన్ని కప్పిపుచ్చడానికి తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. అమాయక మైనర్లపై లైంగిక వేధింపులు, అత్యాచారం, హత్య వంటి దుశ్చర్యలతో వివాదాస్పదమైన ఎపిస్టిన్‌తో సంబంధం ఉన్నట్లు ప్రపంచంలోని అనేక మంది ప్రముఖుల పేర్లు బయటపడడంతో వారంతా నైతిక బాధ్యత వహించి ప్రతిష్టాత్మక పదవులు, హోదాలకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో హరదీప్‌ సింగ్‌ పురి నిశ్చలంగా మంత్రి మండలిలో కొనసాగడం అత్యంత అనైతిక చర్యగా రాష్ట్ర మహిళా కాంగ్రెసు వర్గం ఆరోపించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హరదీప్‌ సింగ్‌ పురిని మంత్రిత్వ శాఖ నుంచి తక్షణమే తొలగించాలని కోరుతు నడి రోడ్డు మీద నిరసన ప్రదర్శించి దిష్టిబొమ్మ దహనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement