న్యాయవృత్తి నిపుణులకు రిటైర్‌మెంట్ లేదు
పర్లాకిమిడి: కృష్ణచంద్ర గజపతి స్వయం ప్రతిపత్తి కళాశాలలో ‘అల్యుమినీ టాక్’ పేరిట ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ న్యాయ కళాశాల విశ్రాంత ప్రొఫెసర్, మహారాష్ట్ర నేషనల్ లా కళాశాల ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ భవానీ ప్రసాద్ పండా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగంలో ‘విద్యార్థులు స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకాలు’ ఎలా ఎంచుకోవాలి. దానివల్ల విద్యార్థుల భవిష్యత్‌లో ఎలా అభివృద్ధి చెందగలమో వివరించారు. 1973–76 బ్యాచ్ విద్యార్థి డాక్టర్ భవానీ ప్రసాద్ పండా మాట్లాడుతూ అప్పట్లో మంచి అధ్యాపకులు ఉండేవారని, వారిలో లైఫ్ సైన్స్ ప్రొఫెసర్ బి.శశిభూషణ్‌రావు, తదితరుల పర్యవేక్షణలో మేము వృత్తిపరమైన విజయాలు సాధించామన్నారు. న్యాయ వృత్తి , అధ్యాపకులకు ఎప్పడూ రిటైర్‌మెంట్ ఉండదని కూడా అన్నారు. తదుపరి ఆయన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌పై అనర్గళంగా మాట్లాడారు. అనంతరం డాక్టర్ భవానీ ప్రసాద్ పండాను ప్రిన్సిపాల్ రాధాకాంత భుయ్యాన్ ఘనంగా సత్కరించారు. ఈ పూర్వ విద్యార్థుల ప్రసంగంలో రసాయన అధ్యాపకులు డాక్టర్ సునాశిరో మిశ్రో, సుభేందు కుమార్ ప్రధాన్, డాక్టర్ వైద్యనాథ్ పండా, తదితరులు భవానీ ప్రసాద్ పండా గురించి మాట్లాడారు.
న్యాయవృత్తి నిపుణులకు రిటైర్‌మెంట్ లేదు


