పర్లాకిమిడి: ఎనిమిదో స్టాండిగ్ కమిటీ ముగింపు సమావేశం భువనేశ్వర్‌లోని లోక్‌సదన్‌లో సోమవారం నిర్వహించారు. పర్లాకిమిడి నియోజికవర్గ శాసనసభ్యులు రూపేష్ పాణిగ్రాహి పలు డిమాండ్లను ప్రతిపాదించారు. పర్లాకిమిడి కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఎం.ఆర్ స్కాన్, ఐసీయూ ఏర్పాటు, నువాగడ బ్లాక్ ఖోజురిపద, చంద్రగిరిలో పోస్టుమర్టాం కేంద్రం నిర్మాణం, ప్రభుత్వ ఆస్పత్రి, పర్లాకిమిడిలో స్పెషలిస్టు డాక్టర్లు, నర్సుల నియామకం, అంబులెన్సులు, ఆక్సిజన్ ప్లాంటు పుణరుద్ధరణ, మార్చురీ (మహాప్రయాణం) వాహనాలు కొనుగోలు చేయాలని స్టాండింగ్ కమిటీ ఎదుట డిమాండ్ చేశారు.


