ఉగాది వేడుకల షెడ్యూల్ ఖరారు
● జయపురంలో 19, 20 తేదీల్లో
శ్రీపరాభవ నామ ఉగాది ఉత్సవాలు
● వివరాలు వెల్లడించిన తెలుగు
సాంస్కృతిక సమితి ప్రతినిధులు
జయపురం: జయపురం తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీల్లో శ్రీపరాభవ నామ ఉగాది ఉత్సవాలతో పాటు జయపురం సిటీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం తెలుగు సాంస్కృతిక సమితి ప్రతినిధులు సిటీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సభ్యుల సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. సమితి అధ్యక్షులు బిరేష్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ సభ్యులు శశి పట్నాయక్ ఉగాది వేడుకల కార్యక్రమాలు ప్రకటించారు. ఈ సందర్భంగా నృత్య పోటీలు, తెలుగు గీతాల ఆదారిత అంశాలతోగల నృత్య ప్రదర్శనలు, బృందగానాలు, యుగళ గీతాలు, సోలో గీతాల నృత్య పోటీలు ఉంటాయన్నారు. పోటీలలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ నెల 12వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల్లోపు 81148 26451, 70089 72383 నంబర్లకు వాట్సాప్ ద్వారా వివరాలు పంపాలన్నారు. వారికి 15వ తేదీన స్క్రూట్నీ నిర్వహిస్తామన్నారు. డాన్స్ అకాడమీలో నృత్యం నేర్చుకున్న వారు లేక డాన్స్ అకాడమీ వారు స్పాన్సర్ చేయబడిన కళాకారులను మాత్రమే పోటీలకు అనుమతిస్తామన్నారు. వారు డాన్స్ అకాడమీల ధ్రువ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు. అలాగే ఈ నెల 15వ తేదీన మహిళలకు సిటీ స్కూల్ ప్రాంగణంలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తామన్నారు. పోటీలలో పాల్గొనదలచిన వారు ముగ్గుల పిండి, రంగులు, ఇతర సామగ్రి వారే తెచ్చుకోవాలని సూచించారు. ముగ్గులు పోటీలో పాల్గొన దలచిన వారు తమ పేర్లను ఈ నెల 12వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య 63702 66106, 63025 04864 నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపించాలన్నారు. అలాగే చిత్ర కళా పోటీలు కూడా నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలలో 12 ఏళ్లలోపు వారు జూనియర్లుగా, 12 నుంచి 18 ఏళ్లలోపు వారిని సీనియర్లుగా పరిగణిస్తామని వెల్లడించారు. 19వ తేదీ ఉదయం 7.30 నుంచి 10 గంటల వరకు నిర్వహించే పోటీలలో జూనియర్లు పల్లెంలో వివిద ఫలాలు చిత్రం, సీనియర్లు ’సిటీ హైస్కూలు ప్రాంగణ భవనం ’చిత్రం వేయాలని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు తమ ఆధార్ కార్డు, ఫొటోపాటు పూర్తి వివరాలు వాట్సాప్‌లో పంపాలని సూచించారు. పోటీలలో పాల్గొనే వారికి డ్రాయింగ్ షీట్‌లు మాత్రం సమకూర్చుతామని.. రంగు పెన్సిళ్లు, బొమ్మ వేయటానికి అవసరమైన వస్తువులు వారే తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. పోటీలలో పాల్గొనదలచిన 63703 280837, 87639 62948 నంబర్లకు ఈ నెల 15వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల్లోపు లోపు వాట్సాప్‌లో పంపాలని వెల్లడించారు. అలాగే ఉగాది రోజున ఉదయం 11కు మహిళలకు వంటల పోటీలను సైతం నిర్వహిస్తామన్నారు. గంటన్నర సమయంలో వంట పూర్తి చేయాలని, హల్వా, గోధుమ రవ్వ, బొబాయి రవ్వ, క్యారెట్, బీట్‌రూట్ లేదా ఆనపకాయతో హల్వా తయారు చేయాల్సి ఉంటుందన్నారు. వంటల పోటీకి కావలసిన స్టౌతో పాటు అన్ని వస్తువులు పోటీదారులే తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. పోటీకి అయిన ఖర్చుకు తగినట్లు విజేతలకు బహుమతులు ఉంటాయని తెలిపారు. వంటల పోటీలకు వచ్చే వారికి సహాయంగా ఇద్దరిని తీసుకురావచ్చని తెలిపారు. పోటీలో పాల్గొన దలచిన వారు 15వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల్లోపు 77519 24005, 93480 65395 నంబర్లకు వాట్సప్ ద్వారా వివరాలు తెలియజేయాలన్నారు. అలాగే తెలుగు సంప్రదాయ వస్త్రధారణ పోటీలు కూడా ఉంటాయన్నారు. పోటీలోపాల్గొన దలచిన వారు 15వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటలలోపు తమ పేర్లను 77352 19129, 95565 05571 నంబర్లకు వాట్సాప్ చేయాలన్నారు. సమావేశంలో సమితి సభ్యులు వై.శ్రీనివాసఖన్నా, పి.మహేష్‌రెడ్డి, దుర్గా శర్మ పాల్గొన్నారు.
ఉగాది వేడుకల షెడ్యూల్ ఖరారు


