ఐసీయూ ఏర్పాటు చేస్తాం
పర్లాకిమిడి: మూడు రోజుల క్రితం పర్లాకిమిడి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూ సౌకర్యం లేక గుమ్మాకు చెందిన మహిళ దీప్తిమొతి బెబర్తా మృతి చెందారు. దీనిపై ఒడిశా లెజిస్లేటివ్ అసెంబ్లీ 8వ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ప్రశ్నను లేవనెత్తారు. పర్లాకిమిడి జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూ సేవలు, మరో వంద బెడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై 11 మంది సభ్యుల స్టాండింగ్ కమిటీ చైర్మన్ బిభూతి భూషణ్ ప్రధాన్ (ఎమ్మెల్యే) సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూ ఏర్పాటుపై ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం నుంచి భువనేశ్వర్‌లో 8వ స్టాండింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.


